Movie: Katha Kamamishu (2025)
Star Cast: Indraja, Karuna Kumar, Harshini Koduru, Venkatesh Kakumanu
Song: Aaratma Athiga Thadabadaku
Music: RR Dhruvan
Singer: Shankar Mahadevan
Lyrics: Sirivennela Seetharama Sastry
Song Length: 4:38
Language: Telugu
Release Date: 2 January, 2025
ఆరాటమా అతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు
ఎదో అలా పడని ముందడుగు, ఏ తోవలో తెలుసా అనకు
ఈ మనువనే మలుపులో ఇపుడిలా, ఎన్నెన్నో ప్రశ్నలు రేపుతు ఆగకు
ఆరాటమా అతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు
దడదడమని ఉరమద మరి తొలకరి మేఘం
అది చినుకుల నడకల గతి తెలిపిన రాగం
ఆ అలికిడే వినగా, ఆనందమే గనక
కలవరమే కలగదుగా తడిసే ఇలకు
గుసగుసమని పలకదు కదా మంగళ వాద్యం
పరిణయమున పందిరికి సందడి సహజం
కోలాహలమే గాని, గోల అనరుగ దాన్ని, కల్లోలం అంటారా కళ్యాణాన్ని
ఈ చిలిపి వేడుకలను అనవసరపు గొడవనుకొని
ఆరాటమా అతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు
కడవరకిక ముడి విడువక బిగిసిన సూత్రం
ఇరు మనసులకొక మనుగడ అని పరమార్థం
ఏడడుగులు వేస్తూ, నీ వెనుక తానొస్తే
వెంటాడే వేటేమో అని భయపడకు
చిన్న చిన్న చిన్న తగవులకిది మొదలని సత్యం
శృతి ముదరని జత చెదరని చెలిమికి సాక్షం
పేచీ పడే పంతం, రాజీ పడే బంధం
వియ్యంలో కయ్యాలే తీయని సమరం, ఆ సంగతే వినమని…
ఆరాటమా అతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు