Movie: Saindhav (2024)
Star Cast: Venkatesh, Shraddha Srinath
Song: Sarada Sarada Saradaga Saagindi Samayam
Music: Santhosh Narayanan
Singer: Anurag Kulkarni
Lyrics: Ramajogayya Sastry
Label: Saregama
Song Length: 3:35
Language: Telugu
Release Date: 11 Dec, 2023
ఎగిరే స్వప్నాలే మనం
మనదే కాదా గగనం
సిరివెన్నెలలో తడిసే గువ్వలం
చిరునవ్వులలో చలనం
ఇది చాల్లే ఇంతే చాల్లే
ఇదిలా నిత్యం ఉంటే చాల్లే
ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేల్లుగా
ఊపిరిలో సుమగంధాలే
సరదా సరదా సరదాగా సాగింది సమయం
మనసు మనసు దూరాలే మటుమాయం
మనకు మనకు పరదాలే లేనే లేవందాం
ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం
కలలా ఉందేంటీ ఇ నిజం
నిజమేనందీ నయనం
మనకే సొంతం అవునా ఈ వరం
విరబూసింది హృదయం
అందాల పూల వందనాలు చేసే రాదారులే
తల నిమురుతున్న పలకరింపులాయె చిరుగాలులే
ఈ ఉల్లాసమే మనకో విలాసమై
మనసంతా చిందాడిందే
సరదా సరదా సరదాగా సాగింది సమయం
మనసు మనసు దూరాలే మటుమాయం
మనకు మనకు పరదాలే లేనే లేవందాం
ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం
ఆనందమే అరచేతులా వాలిందిలా పసిపాపలా
ఒక గుండెలో ఈ మురిపెమంతా బంధించేదేలే
కరిగి ఆ వానవిల్లే ఇలా రంగుల్లో ముంచెత్తగా
ఈ చిత్రం ఏ కుంచెలైనా చిత్రించేదేల
సరదా సరదా సరదాగా సాగిందీ సమయం
మనసు మనసూ దూరాలే మటుమాయం
మనకు మనకూ పరదాలే లేనే లేవందాం
ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం